Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుత్తు డాన్స్‌లో ఇరగదీసిన రజినీకాంత్.. "కబాలి" చిత్రంలో స్టెప్పులే స్టెప్పులట..

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్‌పై పా.రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం "కబాలి". రజినీకాంత్ సరస

కుత్తు డాన్స్‌లో ఇరగదీసిన రజినీకాంత్..
, శనివారం, 25 జూన్ 2016 (11:54 IST)
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్‌పై పా.రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం "కబాలి". రజినీకాంత్ సరసన రాధికా అప్టే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఆడియో ఇటీవలైన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే అందరికి గుర్తుకొచ్చేది స్టైలిష్ డాన్సులు... అదర గొట్టే డైలాగ్స్. రజినికాంత్... స్టైల్, డాన్సులతో అందరిని అదరగొడతాడు. ఈ సినిమాలో రజినీ ఓ మ్యాజిక్ చేస్తున్నాడట. మునుపెన్నడు చేయని విధంగా ఈ సినిమాలో డాన్స్ ఇరగదీసేశాడట.
 
ఇందులో కుత్తు… అనే ఓ వెరైటీ డాన్స్‌తో తెగ ఊపేస్తాడట. ఈ డాన్స్ కొన్ని సెక్లనే ఉంటుందట. కుత్తు డాన్స్… తమిళనాడులో ఫేమస్ అయిన లోకల్ డాన్స్. రజినీకాంత్ కూడా అక్కడి స్థానికులతో కలిసి డాన్స్ చేస్తాడట. నిజంగా ఇది సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు మాత్రం పండగే. అయితే ఇటీవలే రిలీజ్ అయిన "కబాలి" మ్యూజిక్ ఆల్బమ్‌లో మాత్రం ఈ డాన్స్ గురించి ప్రస్తావనే రాలేదు. 
 
కాగా రజినీకాంత్ నటించే సినిమాల్లో అతను మూవీ ప్రారంభమైన వెంటనే కనబడడు. కాస్త రన్‌ టైం తర్వాత స్పెషల్‌ అప్పియరెన్స్ ఇస్తాడు. ఇప్పుడు కబాలిలో కూడా… సినిమా ప్రారంభమైన 15 నిముషాల తర్వాత కనబడతాడని కోలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఇకపోతే జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం!