Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నయన మెడలో తాళి... కుడితిలో పడ్డ ఎలుకపిల్లలా శింబు...

నయన మెడలో తాళి... కుడితిలో పడ్డ ఎలుకపిల్లలా శింబు...
, శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:20 IST)
నయనతార, శింబు పేర్లు చెబితే పెటాకులైన ప్రేమికులు అని చటుక్కున చెప్పేస్తారు. ఐతే ఇలా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు. అదే విచిత్రం అని కొందరనుకుంటుంటే, వాళ్లు నటించే చిత్రాల్లో చాలాచాలా చిత్రాలే జరుగుతున్నాయంటున్నారు కోలీవుడ్ సినీజనం.
 
ఈ చిత్రంలో నయనతార మెడలో శింబు పసుపు తాడు కట్టే సన్నివేశం ఉందని కోలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు. అదే చిత్రానికి క్రూషియల్ పాయింట్ అంట. అందుకే ఈ చిత్రానికి 'ఇది నమ్మ ఆళు' అనే పేరు పెట్టారట. తెలుగులో దీని అర్థం ఇది మన మనిషి అని. చిత్రంలో సెంటిమెంట్ పాలు ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు.
 
కాకపోతే ఈ చిత్రం షూటింగులో స్పీడు బ్రేకర్లు పడుతున్నాయట. దర్శకుడు పాండిరాజ్, హీరో శింబుకు మధ్య గొడవలొచ్చాయని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అందువల్ల పాండిరాజ్ కెమేరాను పక్కనపడేసి సూర్య కోసం కథను రాస్తూ కూర్చుకున్నారట. మరోవైపు నయనతార కూడా డేట్స్ అయిపోతున్నాయ్ చూసుకోండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందట. మొత్తానికి నిర్మాత కూడా అయిన శింబు కుడితిలో పడ్డ ఎలుక పిల్లలా గిలగిల తన్నకుంటున్నాడట.

Share this Story:

Follow Webdunia telugu