Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ దర్శకులకు నన్ను వాడుకోవడం తెలియదు : రెజీనా!

టాలీవుడ్ దర్శకులకు నన్ను వాడుకోవడం తెలియదు : రెజీనా!
, మంగళవారం, 4 ఆగస్టు 2015 (19:51 IST)
టాలీవుడ్ దర్శకులపై కొత్త బ్యూటీ రెజీనా సెటైర్లు వేస్తోంది. నన్ను వాడుకోవడం ఈ దర్శకులకు తెలియదని వాపోతోంది. నిజానికి వాడుకోవడం తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకులకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. వారు వాడుకోవడం మొదలుపెడితే... ఇకే అక్కడేం మిగలదు. కానీ, రెజీనా విషయంలో ఇందుకు భిన్నంగా ఉన్నట్టుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ దర్శకులపై కామెంట్స్ చేస్తోంది.
 
 
ఇదే అంశంపై ఈ అమ్మడు మాట్లాడుతూ.. తెలుగులో తాను నటించిన 'కొత్తజంట', 'పిల్లా నువ్వులేని జీవితం', 'పవర్'.. ఇలా ఏ చిత్రం తీసుకున్నా.. అవి ఎక్కువగా నటనకే అధిక ప్రాధాన్యత ఉన్న పాత్రలేనని చెప్పుకొచ్చింది. ఈ చిత్రాల్లో తన అందాలు ఆరబోసేలా అంటే గ్లామర్ ఎక్స్‌పోజ్ చేసే అవకాశమే లేకుండా పోయిందని తెగబాధపడితోంది. 
 
కెరీర్ మొదట్లో సంప్రదాయ పాత్రలు (ట్రెడిషినల్ రోల్స్) రావడంతో.. వరుసగా అలాంటి పాత్రలకే తనను పరిమితం చేస్తున్నారని తెగ ఫీలైపోతోంది. గ్లామర్ రోల్స్ కోసం వేచి చూస్తున్నానని ఇందుకోసం దర్శకనిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 'సుబ్రమణ్యం ఫర్ సేల్‌'లోనూ పక్కింటి అమ్మాయి పాత్రలోనే నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మరి ఈ భామ బాధను అర్థం చేసుకుని.. ఏ దర్శకుడు గ్లామర్ రోల్ ఇస్తాడో వేచిచూద్ధాం. 

Share this Story:

Follow Webdunia telugu