Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాంకర్ ఉదయభాను ప్రెగ్నెంట్ అట.. నాలుగు పదుల వయస్సులో?

తెలుగుబుల్లి తెరపై ఒక్క వెలుగు వెలిగిపోయిన యాంకర్ ఉదయభాను గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల్లో నటించి తర్వాత బుల్లితెరపై ప్రత్యక్షమైంది. అప్పట్లో ఈటీవీలో ప్రసారం అయ్యే ''హృదయ

యాంకర్ ఉదయభాను ప్రెగ్నెంట్ అట.. నాలుగు పదుల వయస్సులో?
, బుధవారం, 24 ఆగస్టు 2016 (10:54 IST)
తెలుగుబుల్లి తెరపై ఒక్క వెలుగు వెలిగిపోయిన యాంకర్ ఉదయభాను గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల్లో నటించి తర్వాత బుల్లితెరపై ప్రత్యక్షమైంది. అప్పట్లో ఈటీవీలో ప్రసారం అయ్యే ''హృదయాంజలి'' ప్రోగ్రాం ఉదయభానుకి మంచి గుర్తింపు నిచ్చింది. ఆ తర్వాత జెమినీ టీవీలో ప్రసారం అయిన ''సాహసం చేయరా డింబక'', ''ఒన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్స్'' ఉదయభానుని ప్రేక్షకులకి మరింత దగ్గర చేసింది. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో హాట్ హాట్ యాంక‌ర్‌గా బాగా స‌క్సెస్ అయ్యింది.
 
తర్వాత టీవీ యాంకరింగ్ చేస్తూనే... సినిమాల్లో కూడా నటించింది. కొన్ని సినిమాల్లో ఐటెం సాంగుల్లో ఆమె చిందులేసినా వెండితెర మీద ఆమెకు ఆశించినంత గుర్తింపు రాలేదు. దీంతో ఆమెకు యాంకరింగ్‌తో పాటు, సినిమా ఛాన్స్‌లు కూడా తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. కాగా తాజా వివరాల ప్రకారం... ఈ హాట్ టీవీ యాంకర్ తల్లికాబోతుందట. ఉద‌య‌భాను సొంతూరు క‌రీంన‌గ‌ర్ జిల్లా. కాగా చాలా చిన్న వ‌య‌స్సులోనే ఓ ముస్లిం వ్య‌క్తితో పెళ్ల‌య్యింది. అయితే ఆ ముస్లిం వ్య‌క్తితో జ‌రిగిన పెళ్లి ఆమెకు అస్స‌లు ఇష్టం లేదట. ఉద‌య‌భాను త‌ల్లి ఆమెను బ‌ల‌వంతంగా అత‌డికి ఇచ్చి పెళ్లి చేసింది. 
 
అయితే మనస్పర్థల కారణంగా... కొద్దిరోజుల‌కే ఆమె త‌న మొద‌టి భ‌ర్త నుంచి విడాకులు తీసుకుని అతని నుండి దూర‌మైంది. త‌ర్వాత యాంకరింగ్‌పై దృష్టి పెట్టి విజయం సాధించింది. కెరియర్ మాంచి ఊపుమీదున్నప్పుడే... విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న పదేళ్ల తర్వాత పిల్లలు కావాలని అనుకుందట. అందుకే ప్లాన్ చేసి మరి పదేళ్లు తరువాత తల్లి కాబోతోందట ఉదయభాను. నాలుగు పదుల వయసున్న ఏ మాత్రం వయసు తెలియకుండా కనబడటం ఆమెకున్న స్పెషాలిటీ. అయితే ఉదయభాను త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుందన మాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ఇద్దరికీ పెళ్లయింది... ముద్దు సీన్‌ తీసేస్తారా... 'సావిత్రి' ముద్దు సీన్లపై అభ్యంతరం!