Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గోపాల గోపాల' డైరెక్టర్ డాలీతో పవన్ సినిమా చేస్తాడు... కానీ ఎపుడో తెలీదు...

'గోపాల గోపాల' డైరెక్టర్ డాలీతో పవన్ సినిమా చేస్తాడు... కానీ ఎపుడో తెలీదు...
, గురువారం, 25 జూన్ 2015 (17:12 IST)
సినిమా పరిశ్రమలో ఒక టాప్ హీరోతో సినిమా తీయాలంటే ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని స్థితి. ఏడాదికి ఒకటో రెండో సినిమాల్లో నటించే పవన్, మహేష్ బాబుతో సినిమాలు చేయాలంటే ఇక వేరే చెప్పాలా...? ఇప్పుడు గోపాల గోపాల చిత్రం దర్శకుడు డాలీ పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు. 
 
గోపాల గోపాల చిత్రం విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా తను డాలీ దర్శకత్వంలో చిత్రం చేస్తానని చెప్పారు. కానీ అది ఎప్పుడన్నది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే, గబ్బర్ సింగ్ 2 ఇప్పటివరకూ ఒక్క షెడ్యూల్ షూటింగ్ మాత్రమే పూర్తయింది. ఇంకా మొత్తం షూటింగ్ ఈ ఏడాది పూర్తయ్యేట్లు లేదంటున్నారు. మరోవైపు దాసరితో చిత్రం ఉందని ఇండస్ట్రీలో ఒకటే గోల. వీటిమధ్య డాలీ చిత్రం ఎప్పుడు ఉంటుందోననే కామెంట్లు వినబడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu