Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'శ్రీమంతుడు'పై తేజ అంచనా 7 రోజులేనట... 'హోరాహోరీ' విడుదల కోసం హోరాహోరీ

'శ్రీమంతుడు'పై తేజ అంచనా 7 రోజులేనట... 'హోరాహోరీ' విడుదల కోసం హోరాహోరీ
, సోమవారం, 3 ఆగస్టు 2015 (14:15 IST)
ఒకప్పటి జయం డైరెక్టర్ తేజ నటీనటులను హింసించి తనకు రావల్సిన నటనను రాబట్టుకుంటాడని పేరుంది. ఈ విషయాన్ని తను స్టేజీలపైన కూడా డైరెక్టుగా చెప్పేస్తారు. తన చిత్రంలో నటించిన నటీనటులకు ఆ తర్వాత ఇక వెనక్కి చూసుకోవాల్సిన పనిలేదని అంటారు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అదీ మరి. 
 
ఇది అంతవరకే కాదు... ఇప్పుడు మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంపైన కూడా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం మహేష్ నటించిన శ్రీమంతుడు ఆగస్టు 7న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ఇప్పట్నుంచే టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు ప్రేక్షకులు. 
 
శ్రీమంతుడు దెబ్బకు మరెవరూ రెండు వారాల వరకూ తమ చిత్రాలను విడుదల చేసేందుకు జంకుతున్నారట. ఐతే దర్శకుడు తేజ మాత్రం తన చిత్రం హోరాహోరీని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నట్లు టాలీవుడ్ న్యూస్. మహేష్ బాబు చిత్రంతోనే తేజ ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారా... మరి ఇది ఎలాంటి కాన్ఫిడెన్సో...?!!

Share this Story:

Follow Webdunia telugu