Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాసరి, పవన్‌ కళ్యాణ్‌ సినిమాకు బోయపాటి దర్శకత్వం, పవన్ ఫ్యాన్స్ ఓకేనా...?

దాసరి నారాయణ రావు నిర్మాతగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దానికి క్లారిఫై కూడా పవన్‌ ఇటీవలే ఇచ్చాడు. కానీ.. కథ సరిగ్గా కుదరలేదని.. ఇప్పటి పరిస్థితులను బట్టి కథను మార్చి తీయాలని చూస్తున్నారు. ఇందుకు దర్శకుడు ఎవరనేది దాసరి తన శిష్య

దాసరి, పవన్‌ కళ్యాణ్‌ సినిమాకు బోయపాటి దర్శకత్వం, పవన్ ఫ్యాన్స్ ఓకేనా...?
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (16:48 IST)
దాసరి నారాయణ రావు నిర్మాతగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దానికి క్లారిఫై కూడా పవన్‌ ఇటీవలే ఇచ్చాడు. కానీ.. కథ సరిగ్గా కుదరలేదని.. ఇప్పటి పరిస్థితులను బట్టి కథను మార్చి తీయాలని చూస్తున్నారు. ఇందుకు దర్శకుడు ఎవరనేది దాసరి తన శిష్యవర్గంతో ఇటీవలే మీటింగ్‌ వేసి చర్చించారు. 
 
ఎక్కువశాతం మంది.. మాస్‌ డైరెక్టర్‌.. సరైనోడు హిట్‌ ఇచ్చిన బోయపాటి వైపు మొగ్గినట్లు సమాచారం. దాంతో.. పవన్‌ సినిమాకు బోయపాటి దర్శకుడు అనేది ఖరారైనట్లు ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే.. బాలయ్యకు.. లెజెండ్‌.. సినిమాను ఇచ్చాక.. ఆ సినిమా క్రేజ్‌ ఎక్కడికో తీసికెళ్ళింది. దాంతో.. రాజకీయ పరిస్థితుల వల్ల బాలయ్య ఎం.ఎల్‌.ఎ.కూడా అయ్యాడు. 
 
ఎటువైపు ఆలోచించినా.. బోయపాటి బెటర్‌ అనే నిర్ణయానికి దాసరి వచ్చినట్లు కన్పిస్తోంది. కాకపోతే.. ఈ చిత్రం ప్రారంభం.. ఈ ఏడాది ఆఖరులోగానీ.. వచ్చే ఏడాదిలోగానీ వుండవచ్చని విశ్వసనీయ సమాచారం. ఇంకేం.. పవన్‌ అభిమానులకు.. పండుగే మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతికి ఎసరుపెట్టిన రీతూ వర్మ... స్వామి రారా సీక్వెల్‌‌లో పెళ్ళిచూపులు స్టార్