Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలీ డబుల్ మీనింగ్ డైలాగులతో అర్థాంతరంగా ఆగిపోయిన 'ఆలీతో జాలీగా'!

అలీ డబుల్ మీనింగ్ డైలాగులతో అర్థాంతరంగా ఆగిపోయిన 'ఆలీతో జాలీగా'!
, గురువారం, 19 మే 2016 (15:01 IST)
వెండితెరను తన వైవిధ్యమైన నటనతో కామెడీ పండించిన కమెడియన్ అలీ. ఇతగాడు బుల్లితెరమీద ''ఆలీతో జాలీగా'' ప్రొగాంకి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఉన్నట్టుండి ప్రోగ్రాం ఆగిపోయినట్టు వార్తలు వినబడుతున్నాయి. ఈ షో ద్వారా ఆలీ బాగా పాపులర్ అయ్యాడు. ఒకప్పుడు ఆరుకుపైగా రేటింగ్ సాధించిన ఈ షో.. హఠాత్తుగా 2 పాయింట్లకు దిగజారిపోయిందట. ఈ షో ఇంత ప్లాప్ అవ్వ‌డానికి కారణం ఆలీ బూతు డైలాగులు, డ‌బుల్ మీనింగ్ డైలాగులే అన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ షోను ఫ్యామిలీ మెంబ‌ర్స్ చూడ‌లేక‌పోతున్న కారణంతో రేటింగులు త‌గ్గుముఖం పట్టాయి. కాబట్టి షోను ఆపుతున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఈ షోకు మొగ్గుచూపుతుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.
 
కానీ, ఈ షోని ఎంజాయ్ చేస్తున్నవారు ఈ విధంగా స్పందిస్తున్నారు. తెలుగు‌లో వచ్చే గేమ్ షోలు దాదాపు డబుల్ మీనింగ్స్ తరహాలోనే వున్నాయని, కాకపోతే అలీ మొదటి నుంచి అందర్నీ నవ్విస్తూ, హుషారుగా మాట్లాడడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇలాంటి షోలను నవ్వుగా తీసుకోవాలేగానీ సీరియస్‌గా తీసుకోరాదని, హ్యూమర్ కంటెంట్‌ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి షోలు అవసరమని వారంటున్నారు. 
 
మరోవైపు ఈ షో అర్థాంతంగా ఆగిపోయినా, కాస్సెప్ట్ మార్చి అలీ తన సెటైరికల్ డైలాగ్స్‌‌తో మళ్లీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని బుల్లితెర వర్గాలు అంటున్నాయి. మరి టైటిల్ ఏమైనా మార్చి ఈ షోను కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. ఇక అలాగే ఆలీ కూడా కాస్త డ‌బుల్ మీనింగ్ డైలాగులు త‌గ్గించి వ్య‌వ‌హ‌రించాల‌న్న కామెంట్లు కూడా ప‌డుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంచరణ్‌కు ఉపాసన పెట్టిన ముద్దుపేరేంటి? ఇంట్లో చెర్రీ ఎలా ఉంటాడు?