Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మికి జ్ఞానోదయం అయిందా? సెలవు తీసుకుంటానంటున్న బ్రహ్మానందం!

బ్రహ్మి.. బ్రహ్మానందం... హవా ఇంకా కొనసాగుతుందా? ఇన్నాళ్ళు ఎలా ఉన్నారనే విషయాన్ని ఇండస్ట్రీలో చాలామంది ప్రశ్నించుకుంటారు. కొందరైతే ఓల్డ్‌ అయిపోయాడనీ.. అయినా.. ఇంకా ఆయన హవా నడుస్తుందని రకరకాలుగా చెప్పుక

బ్రహ్మికి జ్ఞానోదయం అయిందా? సెలవు తీసుకుంటానంటున్న బ్రహ్మానందం!
, ఆదివారం, 7 ఆగస్టు 2016 (09:56 IST)
బ్రహ్మి.. బ్రహ్మానందం... హవా ఇంకా కొనసాగుతుందా? ఇన్నాళ్ళు ఎలా ఉన్నారనే విషయాన్ని ఇండస్ట్రీలో చాలామంది ప్రశ్నించుకుంటారు. కొందరైతే ఓల్డ్‌ అయిపోయాడనీ.. అయినా.. ఇంకా ఆయన హవా నడుస్తుందని రకరకాలుగా చెప్పుకుంటున్న... విషయంలో బ్రహ్మికి తెలియక ఎలా వుంటుంది. ఇది ఇండస్ట్రీ.. పక్కవాడి విషయాలు బ్రహ్మికి తెలిసినట్లే .. ఈయన విషయాలు పక్కవాడికి తెలియవా.. అందుకే కాబోలు.. బ్రహ్మి.. తనలోని ఓ కోణాన్ని ఆవిష్కరించారు.
 
సప్తగిరి, '30 ఇయర్స్‌ ఇండస్ట్రీ' పధ్వీ, జబర్‌దస్త్‌ టీమ్‌.. అంతా హాస్యాన్ని ఏలేస్తుంటే.. బ్రహ్మి వెనకడుగు వేస్తాడని భావించారు. కానీ కొన్ని సినిమాల్లో ఆయన్ను మాత్రం తీసుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్‌గా.. 'ఆటాడుకుందా రా'! సినిమాలో నటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'ఆటాడుకుందాం రా' సినిమా పూర్తిగా మిమ్మల్ని నవ్విస్తుందన్నారు. 
 
ఇలాంటి కొత్తతరం దర్శకులు, రచయితలు, నటులు ముందుకు రావాలని, పాతతరం వారు కాస్త పక్కకు జరగాలని తానూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, నేను కూడా కొంచెం పక్కకు జరుగుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.. అంటూ బ్రహ్మి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంటే తన గురించి తనే ఇలా అనడం.. ఆశ్చర్యంగా వున్నా... ఇక చాలు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. చూద్దాం. బ్రహ్మి మాటల్లో ఆంతర్యం ఏమిటో? 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలెక్షన్ల వర్షం... 'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'కబాలి'.. ఇప్పటికే రూ.650 కోట్లు వసూలు!