Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరు 150వ చిత్రం నుంచి అలీ ఔట్... చిరంజీవి అంతపని చేశారా...? ఏమైంది?

ఈమధ్య కమెడియన్ అలీకి కాలం కలిసిరానట్లు అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో సునీల్ డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్లేసులో అలీని పెట్టి లాగించేశారు. కానీ అలీ-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కుదిరినంతగా

చిరు 150వ చిత్రం నుంచి అలీ ఔట్... చిరంజీవి అంతపని చేశారా...? ఏమైంది?
, సోమవారం, 8 ఆగస్టు 2016 (13:06 IST)
ఈమధ్య కమెడియన్ అలీకి కాలం కలిసిరానట్లు అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో సునీల్ డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్లేసులో అలీని పెట్టి లాగించేశారు. కానీ అలీ-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కుదిరినంతగా చిరు-అలీ కాంబినేషన్ వర్కవుట్ కాలేదట. దానితో దర్శకుడు వివి వినాయక్ పెదవి విరిచాడట. అలీ ప్లేసులో సునీల్ ను పెట్టి మళ్లీ రీషూట్ చేద్దామని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లాడట. దానికి చిరంజీవి కూడా సరే... అలాగే కానిద్దాం అనేశాడని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తేలాల్సి ఉంది.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని ఇప్పటికే పలువురు రజినీకాంత్ చిత్రం కబాలితో పోటీపెడుతున్నారు. కబాలి చిత్రం ఇప్పటికే రూ. 600 కోట్లు వసూలు చేసి బాహుబలిని బీట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి 150వ చిత్రం కబాలిని బీట్ చేయాలన్న పట్టుదలతో ప్రతి సన్నివేశాన్ని చాలా పగడ్బందీగా చేస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత ఔట్.. చైతూతో జోడీ కట్టనున్న పాలబుగ్గల బ్యూటీ!