Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి 'కత్తి'లాంటోడు.. ఆగస్టు 22న ఫస్ట్ టీజర్.. ఆ రోజు స్పెషాలిటీ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. కథా పరంగానే కాకుండా, నిర్మాణ పరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, హీరో రాంచరణ్ నిర్మిస్త

చిరంజీవి 'కత్తి'లాంటోడు.. ఆగస్టు 22న ఫస్ట్ టీజర్.. ఆ రోజు స్పెషాలిటీ ఏంటి?
, మంగళవారం, 28 జూన్ 2016 (14:28 IST)
మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. కథా పరంగానే కాకుండా, నిర్మాణ పరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, హీరో రాంచరణ్ నిర్మిస్తుండగా, సంచలన దర్శకుడు వివి.వినాయక్ డైరక్ట్ చేస్తున్నారు.
 
తమిళ సూపర్ హిట్ మూవీ 'కత్తి'కి రీమేక్ ఈ చిత్రం. అయితే, చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి ఇపుడు అభిమానులకు ఓ శుభవార్త వచ్చింది. ఈ చిత్రం టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టీజర్‌ను ఆగస్టు 22వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. 
 
ఆగస్టు 22వ తేదీ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆ రోజున ఈ చిత్రం ఫస్ట్ టీజర్‌ను అభిమానులకు బర్త్‌డే గిఫ్టుగా ఆ రోజున విడుదల చేయాలని చిత్ర నిర్మాత, దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం చిరు 150వ సినిమా టీజర్‌ టాపిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కబాలి'లో రజినీకాంత్ ఏజ్డ్ గెటప్ 20 నిమిషాలేనట.. జూలై 15న రిలీజ్!