Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు షాకిచ్చిన బోయపాటి... నేను చాలా బిజీ అంటూ తప్పించుకున్న రాజమౌళి!

చంద్రబాబుకు షాకిచ్చిన బోయపాటి... నేను చాలా బిజీ అంటూ తప్పించుకున్న రాజమౌళి!
, ఆదివారం, 11 అక్టోబరు 2015 (11:18 IST)
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తేరుకోలేని షాకిచ్చినట్టు సమాచారం. అలాగే, ఎస్ఎస్ రాజమౌళి కూడా తాను బిజీగా ఉన్నట్టు చెప్పి తప్పించుకున్నట్టు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఒక పండుగలా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయంతెల్సిందే. ఇందులోభాగంగా... గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి హారతికి ఏర్పాటు చేసిన విధంగా హంగులు అద్దాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇందుకు దర్శకులు బోయపాటి, రాజమౌళిని కలవమని తన అధికారులను పురమాయించారు. 
 
వారి సలహాలతో సినిమా సెట్టింగ్ తీరులో స్వాగతతోరణాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు చెప్పిందే తడవుగా అధికారులు ఆర్ట్ డైరక్టర్ తోటతరణి, దర్శకులు రాజమౌళి, బోయపాటిలను అధికారులు వెళ్లి కలిశారు. అయితే చంద్రబాబు ఇచ్చిన ఆఫర్లను చూసి మొహం మొత్తిన బోయపాటి అసలు కుదరదు అని చెప్పేశాడట. ఇక రాజమౌళి అయితే తాను సినిమాల్లో బిజీ అని చెప్పాడట. మిగిలింది తోటతరణి ఇక ఆయన ఆధ్వర్యంలోనే అమరావతి స్వాగత ఏర్పాట్లు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu