Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్ పార్కింగ్ వ్యవహారంపై గొడవ.. దర్శకుడి ఇంటిపై నాటు బాంబులతో దాడి?

కార్ పార్కింగ్ వ్యవహారంలో కోలీవుడ్ దర్శకుడికి, పక్కింటి వారికి పెద్ద గొడవై జరిగింది. దీంతో ఆ దర్శకుడి ఇంటిపై నాటు బాంబులతో దాడి చేసినట్టు సమాచారం. ఈ వివరాలను పరిశీలిస్తే...

కార్ పార్కింగ్ వ్యవహారంపై గొడవ.. దర్శకుడి ఇంటిపై నాటు బాంబులతో దాడి?
, బుధవారం, 24 ఆగస్టు 2016 (18:18 IST)
కార్ పార్కింగ్ వ్యవహారంలో కోలీవుడ్ దర్శకుడికి, పక్కింటి వారికి పెద్ద గొడవై జరిగింది. దీంతో ఆ దర్శకుడి ఇంటిపై నాటు బాంబులతో దాడి చేసినట్టు సమాచారం. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తమిళ చిత్రాలు 'సామి', 'సింగం' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు హరి. తన ఇంటి పక్కన ఉన్నవాళ్లతో కారు పార్కింగ్ విషయంలో హరికి చిన్నపాటి గొడవ జరిగింది. పక్కనే నివశిస్తున్న కార్తీక్, కరుప్పస్వామిలు హరితో గొడవపడ్డారు. అంతేకాకుండా చంపేస్తామని కూడా బెదిరించినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
బెదిరించడంతో సరిపెట్టకుండా హరి ఇంటిపై రెండు నాటు బాంబులు విసిరేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో భయబ్రాంతులకు గురైన హరి వెంటనే విరుంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ దాడికి తెగబడ్డాడని హరి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజ‌య‌ద‌శ‌మికి రాంచ‌ర‌ణ్‌ - సురేంద‌ర్‌ రెడ్డిల 'ధృవ‌'