Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌతమీపుత్ర శాతకర్ణికి బాలయ్య రెమ్యునరేషన్ రూ.2 కోట్లు తగ్గించుకున్నాడట..నిజమేనా?

ప్రస్తుతం తెలుగు స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌ ఆకాశాన్ని తాకుతోంది. యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకుగాను బాల‌య్య త‌న కేరీర్‌లోనే

గౌతమీపుత్ర శాతకర్ణికి బాలయ్య రెమ్యునరేషన్ రూ.2 కోట్లు తగ్గించుకున్నాడట..నిజమేనా?
, గురువారం, 3 నవంబరు 2016 (11:14 IST)
ప్రస్తుతం తెలుగు స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌ ఆకాశాన్ని తాకుతోంది. యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకుగాను బాల‌య్య త‌న కేరీర్‌లోనే అత్యధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు సమాచారం. ఈ సినిమా కోసం బాలకృష్ణ తీసుకుంటున్నది దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలట. బాల‌య్య ఈ మొత్తాన్ని క్యాష్ రూపంలోనే తీసుకుంటున్నార‌ట‌.
 
చారిత్రక నేపథ్యం కావడం వలన, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమాకి బాలకృష్ణకి 10 కోట్లను పారితోషికంగా ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వచ్చారట. కానీ ఈ సినిమాకి భారీ స్థాయిలో ఖర్చు అవుతుందని తెలిసిన బాలకృష్ణ, కావాలనే తన పారితోషికంలో రూ.2 కోట్లను తగ్గించుకుని తీసుకున్నారట. అలా రూ.2 కోట్లను తగ్గించుకోవడం అన్నది బాలయ్యకే చెల్లిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఇదిలావుంటే... ఈ సినిమా థియేట్రికల్ రైట్స్.. డబ్బింగ్.. ఆడియో.. శాటిలైట్ రైట్స్ కలుపుకుని 70 కోట్ల వరకూ బిజినెస్ చేసింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్యామల్ చీటింగ్ చేసిందట.. వంటల ప్రోగ్రామ్‌లో టేస్ట్ చేసేది ఆమె కాదట.. ఓన్లీ ఎక్స్‌ప్రెషన్