Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైండ్ ఆబ్సెంట్... బాడీ ప్రెజెంట్...! 'పికె' టీమ్‌లో గుసగుసలు..!

మైండ్ ఆబ్సెంట్... బాడీ ప్రెజెంట్...! 'పికె' టీమ్‌లో గుసగుసలు..!
, శనివారం, 13 డిశెంబరు 2014 (12:55 IST)
ప్రముఖ భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ మైండ్ ఆబ్సెంట్.. బాడీ ప్రెజెంట్ అంటూ 'పికె' సినిమా యూనిట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయట. 
 
అసలు కథేంటంటే... కోహ్లీ ఎక్కడికి వెళితే, అక్కడకు వాలిపోయే అనుష్క, ఈ సారి టీమిండియాని గెలిపించడానికి కోహ్లీ ఆస్ట్రేలియాలో చెమటోడ్చుతుంటే.. అనుష్క మాత్రం ఇండియాలోనే ఉంది. 
 
అయితే వెళ్లాలని ఉన్నా.. మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ ముందు అనుష్క శర్మ పప్పులు ఉడకవు. అందుకే పాపం అనుష్క, కిమ్మనకుండా 'పికె' సినిమాకి పబ్లిసిటీ ఇస్తూ, ఇండియాలోనే ఉండిపోయిందట. 
 
ఆమె ఇక్కడే ఉన్న, ఆమె మనసు మాత్రం ఆస్ట్రేలియాలో చెక్కర్లు కొడుతోందని కొందరు అంటుండగా, కెరీర్‌ పట్ల అనుష్క డెడికేషన్‌ని ఎవరూ క్వశ్చన్‌ చేయలేరని ఆమె ఫ్రెండ్స్‌ అంటున్నారు. 
 
సాధారణంగా సినీ ప్రమోషన్స్‌లో అనుష్క చాలా హుషారుగా ఉంటుంది. కానీ 'పికె' ప్రమోషన్‌లో ఆమె డల్‌ అయ్యిందట. అందుకే ఆమె మైండ్ ఆబ్సెంట్... బాడీ ప్రెజంట్... అంటూ 'పికె' సినీ యూనిట్ కామెంట్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu