Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతిలోక సుందరిగా అనుష్క అదరగొడుతుందట...

నటి అనుష్క ఇటీవలే 'సైజ్‌ జీరో' కోసం బరువు పెరిగి.. మరో సినిమా కోసం బరువు తగ్గింది. అరుంధతి తర్వాత మరలా అలాంటి పాత్రతో సినిమా చేయలేదు. తాజాగా లేడీ ఓరియెంటెడ్‌ నేపథ్యంలో ఓ చిత్రంలో నటిస్తోంది. యువి క్రియేషన్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం లాంఛనంగా బుధ

అతిలోక సుందరిగా అనుష్క అదరగొడుతుందట...
, బుధవారం, 27 ఏప్రియల్ 2016 (20:28 IST)
నటి అనుష్క ఇటీవలే 'సైజ్‌ జీరో' కోసం బరువు పెరిగి.. మరో సినిమా కోసం బరువు తగ్గింది. అరుంధతి తర్వాత మరలా అలాంటి పాత్రతో సినిమా చేయలేదు. తాజాగా లేడీ ఓరియెంటెడ్‌ నేపథ్యంలో ఓ చిత్రంలో నటిస్తోంది. యువి క్రియేషన్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం లాంఛనంగా బుధవారంనాడు ప్రారంభమైనట్లు తెలిసింది. కాగా, మరోవైపు 'బాహుబలి'-2లో ఆమె నటిస్తోంది. ఇందులో అనుష్క అతిలోక సుందరిగా కనిపిస్తుందట.
 
యువరాణిగా .. మహారాణిగా ఆమె ఈ సినిమాలో దర్శనమిస్తుందని అంటున్నారు. 'బాహుబలి' భార్యగా ఆమె పాల్గొనే పోరాట సన్నివేశం ఒకటి ఈ సినిమాలో వుందట. ఈ సన్నివేశం ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. దేవసేనను దక్కించుకోవడానికి బాహుబలికి .. భల్లాల దేవుడికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు కూడా ఒక రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. అలాగే తన తల్లి దేవసేన ద్వారా నిజం తెలుసుకున్న శివుడు, భల్లాలదేవుడుతో తలపడే సన్నివేశాలు కూడా థ్రిల్‌ కల్గిస్తాయని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ కళ్యాణ్‌, ఎస్‌.జె. సూర్య చిత్రం... జుట్టు కత్తిరించి వెరైటీగా పవన్...