Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరైనోడు బ్లాక్ బస్టర్ సాంగ్ హిట్టైతే.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌లో అంజలి ఐటమ్ గర్ల్?!

సరైనోడు బ్లాక్ బస్టర్ సాంగ్ హిట్టైతే.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌లో అంజలి ఐటమ్ గర్ల్?!
, సోమవారం, 18 ఏప్రియల్ 2016 (14:49 IST)
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్ననటి అంజలి. ఆ తర్వాత స్టార్‌గా ఎదిగేందుకు సెలెక్టివ్ సినిమాలే చేసింది. అంతేకాదు చాలా వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపే మొగ్గు చూపుతోంది. చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్‌గా ఉన్న అమ్మడు ఇప్పుడు కొత్తగా ఐటం సాంగ్స్‌తో కూడా ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యింది. 'శంకరాభరణం'' సినిమాలో గంటా సాంగ్‌తో కుర్రకారు గుండెల్లో గంటలని మోగించిన అమ్మడు ఇప్పుడు సరైనోడు సినిమాలో ''బ్లాక్ బస్టర్'' సాంగ్‍తో మతి పోగొట్టేందుకు రెడీ అయ్యింది. 
 
'సరైనోడు'లో అంజలి చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందని ఫిలిమ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఈ సాంగ్ మీద అంజలి కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటె యంగ్ టైగర్ ప్రస్తుతం తీస్తున్న 'జనతా గ్యారేజ్‌'లో కూడా ఓ ఐటం సాంగ్ పెట్టే బరిలో ఉన్నాడట దర్శకుడు కొరటాల శివ. ముందు దర్శకుడు పాలబుగ్గల తమన్నాను తీసుకోవాలని అనుకున్నారట కాని అంజలి 'సరైనోడు'లో చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్ చూసి అంజలి అయితేనే ఈ సాంగ్‌కి కరెక్ట్ అని డైరెక్టర్ నిర్ణయించుకున్నాడట. 
 
ఇద్దరిలో ఎవరో ఒకరి చేత ఆ సాంగ్ చేయించే ఆలోచనలో ఉన్నారు జనతా గ్యారేజ్ టీం. అయితే 'సరైనోడు' సాంగ్ హిట్ అయితే కనుక మొదటి ఛాయిస్ అంజలినే అని తేలిపోతుంది. మరి ఈ విషయం పై యంగ్ టైగర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu