Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'రాజోలు అమ్మాయి' అంజలికి BMW ఎలా వచ్చిందబ్బా...?

'రాజోలు అమ్మాయి' అంజలికి BMW ఎలా వచ్చిందబ్బా...?
, సోమవారం, 21 జులై 2014 (15:26 IST)
గీతాంజలి చిత్రంలో వేశ్య పాత్ర పోషిస్తోందంటూ అంజలి గురించి గత నాలుగైదు నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అచ్చతెలుగు అమ్మాయిగా నటించిన ఈ రాజోలు అమ్మాయి అకస్మాత్తుగా వేశ్య పాత్రకు సై చెప్పడంపై తను సమర్థించుకుంటుందనుకోండి. 
 
ఐతే ఇపుడీ భామ ఈమధ్య ఏ ఫంక్షన్లకైనా తొడలు కనిపించే మినీ స్కర్టులు వేసుకుని వస్తోంది. పైగా కెమేరాల ముందు ఎలాంటి బెరుకు లేకుండా అలా తొడల అందాలను చూపిస్తూ కూర్చుంటోంది. దీన్నిబట్టి అంజలి హాటెస్టుగా కనబడేందుకు సిద్ధమైపోయిందనే ప్రచారం జరుగుతోంది. 
 
ఇదిలావుంటే లేటెస్టుగా అంజలి ఖరీదైన BMW కారులో తిరుగుతోందట. అంజలి కారు పక్కనే నిలబడి ఉన్న ఫోటోను కోన వెంకట్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో మొన్నటివరకూ పుట్టెడు సమస్యలు, ఫ్లాపులతో ఉన్న ఈ భామకు ఒక్కసారిగా బీఎండబ్ల్యూ కారు ఎలా వచ్చిందబ్బా అని టాలీవుడ్ సినీజనం తెగ ఆలోచిస్తున్నారు. 
 
కొందరేమో గీతాంజలి ప్రొడ్యూసర్స్ ఏమైనా కొని గిఫ్టుగా ఇచ్చారేమో అంటుంటే... అదేమీ కాదు... ఆమె వెంట ఉండే ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చి ఉంటాడని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఆ బీఎండబ్ల్యూ ఎలా వచ్చిందో ఏమో...?!!

Share this Story:

Follow Webdunia telugu