Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్లామర్ డోస్ పెంచేందుకు సై.. అనసూయ, రేష్మీలకు పోటాపోటీగా యాంకర్ శ్రీముఖి..!!

టాలీవుడ్‌లో యాంకర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ అండ్ హాట్ హీరోయిన్లుగా పేరుకొట్టేసిన అనసూయ, రేష్మిలను బీట్ చేసేందుకు మరో యాంకర్ రెడీ అయిపోయింది. అదుర్స్ షో ద్వారా యాం

గ్లామర్ డోస్ పెంచేందుకు సై.. అనసూయ, రేష్మీలకు పోటాపోటీగా యాంకర్ శ్రీముఖి..!!
, శుక్రవారం, 1 జులై 2016 (18:07 IST)
టాలీవుడ్‌లో యాంకర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ అండ్ హాట్ హీరోయిన్లుగా పేరుకొట్టేసిన అనసూయ, రేష్మిలను బీట్ చేసేందుకు మరో యాంకర్ రెడీ అయిపోయింది. అదుర్స్ షో ద్వారా యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన శ్రీముఖి ''ప్రేమ ఇష్క్ కాదల్'' అనే చిత్రంతో టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మార్కులు కొట్టేసింది. 
 
అయితే శ్రీముఖికి ఇష్క్ కాదల్‌కు తర్వాత మంచి ఆఫర్లు రాలేదు. అయినప్పటికీ చిన్న చిన్న రోల్స్ చేస్తూ యాంకర్‌గానే శ్రీముఖి కొనసాగింది. ప్రస్తుతం పటాస్ వంటి కామెడీ షోలలో నటిస్తూ ఇరగదీస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సినీ ఛాన్సుల కోసం ఎక్స్‌పోజింగ్, స్కిన్ షో చేసేందుకు రెడీ అయ్యింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెలిగిపోతున్న అనసూయ, హాట్ బ్యూటీగా రాణిస్తున్న రేష్మీలకు పోటీ ఇవ్వనుంది. 
 
ఎప్పుడైతే గ్లామర్ డోస్ పెంచేందుకు సై అందో అప్పటి నుంచి నిర్మాతలు, దర్శకులు శ్రీముఖి జపం చేస్తున్నారు. ఇప్పటికే అమ్మడుకు చేతినిండా ఆఫర్లు ఉన్నాయిని టాలీవుడ్‌ టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆటాడుకుందాం.. రా' చిత్రంలో ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ 'పల్లెకు పోదాం.. పారుని చూద్దాం' రీమిక్స్‌