Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో... టీవీ యాంకర్ అనసూయ రేటు రూ.కోటి!

వామ్మో... టీవీ యాంకర్ అనసూయ రేటు రూ.కోటి!
, మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (11:14 IST)
టీవీ యాంకర్స్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్లుగా గుర్తింపు పొందిన వారిలో అనసూయ ఒకరు. ఈమె సరికొత్త రికార్డును సృష్టించనున్నారనే వార్తలు వినొస్తున్నాయి. యాంకర్స్ చరిత్రలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేయాడానికి రెఢీ అవబోతోందట. ఇంతకీ ఏంటీ ఆ రికార్డు అనేగా మీ డౌట్. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అత్తారింటికి దారేది” వంటి మెగా ప్రాజెక్టును వదులుకుంది. అలాంటి తప్పు ఈ దఫా చేయడానికి అనసూయం లేదని తెలుస్తోంది. 
 
తాజాగా, ఈ “జబర్దస్త్” మాజీ యాంకర్‌ని ఓ బంపర్ ఆఫర్ వరించిందట. మొన్నటి దాకా సినిమాలో నటించే ఉద్దేశ్యం లేదని చెపుతూ వచ్చిన అనసూయ.. ఆ తర్వాత ఫోటో షూట్‌లలో తెగ పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమని ఇపుడు తెలుస్తున్నాయి. ఓ నిర్మాత అనసూయను అప్రోచ్ కాగా, ఆమె ఏకంగా కోటీ రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం. 
 
సదరు నిర్మాత అనసూయని మూడు నెలల డేట్స్ అడిగాడని అందుకు అనసూయ తన టీవీ ప్రోగ్రామ్స్ వదులుకోవాలి కాబట్టి కోటి రూపాయలు డిమాండ్ చేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే, అనసూయకు ఇటువంటి అవకాశం రాలేదని కూడా ఆమె సన్నిహితులు కొట్టి పారేస్తుతున్నారు. అయితే అనసూయకు అటువంటి బంపర్ ఆఫర్ వచ్చిందని కూడా పలువురు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu