Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొలిటికల్ కెరీర్ క్వచ్చన్ మార్క్... సినిమాల్లోకి ఆనం వివేకానంద రెడ్డి...

పొలిటికల్ కెరీర్ క్వచ్చన్ మార్క్... సినిమాల్లోకి ఆనం వివేకానంద రెడ్డి...
, బుధవారం, 22 అక్టోబరు 2014 (15:57 IST)
మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు చూశాక ఇక ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకాలు పోయినట్లున్నాయి. అందుకే ఎవరి కెరీర్ వారు వెతుక్కునే పనిలో పడ్డారు. తాజాగా ఆనం బ్రదర్స్ లో ఆనం వివేకానంద రెడ్డి మరో కొత్త మార్గాన్ని వెతుక్కుంటున్నారట. 2014లో తెదేపాలో చేరదామనుకున్నప్పటికీ బెర్త్ లభించకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండటం వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 
 
అందువల్ల మరో కొత్త మార్గంలో వెళ్లేందుకు చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆనం వివేకానందరెడ్డి మీడియా ముందు చెప్పే మాటలు, ఆయన చేష్టలతో జనాన్ని ఆకట్టుకునే విధానం తెలియంది కాదు. అందువల్ల ఆయన సినిమాల్లో ఎంట్రీ ఇచ్చుకుంటే సూపర్ గా రాణిస్తారని ఎవరో చెప్పారట. ఆ మాటలను నిజం చేసేందుకు ఆనం కంకణం కట్టుకున్నారని చెప్పుకుంటున్నారు నెల్లూరు రాజకీయ వర్గాలు. చూడాలి మరి ఆనం స్టెప్ ఎలా ఉండబోతుందో...?

Share this Story:

Follow Webdunia telugu