Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరు 150 చిత్రం గురించి ఆనం కూడా చెపుతున్నారట... ఏమనీ...?!!

చిరు 150 చిత్రం గురించి ఆనం కూడా చెపుతున్నారట... ఏమనీ...?!!
, మంగళవారం, 30 జూన్ 2015 (20:31 IST)
చిరంజీవి 150వ చిత్రం గురించి రకరకాల కథనాలు విన్పిస్తున్నాయి. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్‌ చరణ్‌ మాత్రం సామాజిక అంశంతో కూడిన పాయింట్‌తో చిత్రం వుంటుందని సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు ప్రకటించనున్నారు. ఇప్పటివరకు పూరీ జగన్నాథ్‌ దర్శకుడనీ, వినాయక్‌ అని వార్తలు విన్పిస్తున్న నేపథ్యంలో అసలు చిత్ర కథ గురించి నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మాత్రం తనను కలిసిన సన్నిహితులతో చిరంజీవి చేయబోయే చిత్రంలోని అంశాలు చర్చిస్తున్నారట.
 
సామాజిక న్యాయం అంశంపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నారని చెబుతూ..... ప్రజస్వామ్యంలో బ్యాన్‌ అనేది ఎవరిపై వుండాలి? ఏవిధంగా వుండాలి? దానికి మీడియా కూడా వుంటుందా? అనే రకరకాల సమస్యలు కామన్‌మేన్‌కు అనుగుణంగా వుండేలా వుంటుందని తెలియవచ్చింది. రాజకీయ అంశాలతో కూడిన ఈ కథకు ఆయనే సరైన న్యాయం చేయగలరనీ, అంతటి పవర్‌ఫుల్‌ నటుడు లేరని అంటున్నారు. ఏదేమైనా చిరు కెరీర్‌లో చిరస్థాయిగా వుండేలా పలువురు మేథావుల సలహాలు తీసుకుని కథను సిద్ధం చేసుకుంటున్నారనేది అర్థమవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu