Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విలన్ ఉపేన్ పటేల్‌తో అమీజాక్సన్ డేటింగ్ చేస్తుందా?

బ్రిటీష్ బ్యూటీ అమీజాక్స‌న్ బాలీవుడ్ హీరో ఉపేన్ పటేల్‌తో డేటింగ్‌లో ఉందా? చ‌డిచ‌ప్పుడు లేకుండా వీళ్లిద్ద‌రు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ్డారు? వ‌ంటి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల గురించి ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ ట

విలన్ ఉపేన్ పటేల్‌తో అమీజాక్సన్ డేటింగ్ చేస్తుందా?
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (16:35 IST)
బ్రిటీష్ బ్యూటీ అమీజాక్స‌న్ బాలీవుడ్ హీరో ఉపేన్ పటేల్‌తో డేటింగ్‌లో ఉందా? చ‌డిచ‌ప్పుడు లేకుండా వీళ్లిద్ద‌రు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ్డారు? వ‌ంటి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల గురించి ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ''మ‌ద‌రాసు ప‌ట్ట‌ణం'' సినిమాతో త‌మిళంలో అడుగుపెట్టిన ఈ భామ ఆ త‌ర్వాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ''ఐ'' సినిమాతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. ఆ సినిమా స‌క్సెస్ కాన‌న‌ప్ప‌టికీ అటు బాలీవుడ్, కోలీవుడ్లో అవ‌కాశాలు అందుకుంటోంది. 
 
అయితే ఇంత‌లోనే ఉపేన్ పటేల్‌తో ఎఫైర్ న‌డుపుతుంద‌న్న వార్త ఇప్పుడు సెన్షేష‌న్ అయింది. వీరిద్ద‌రు ప్ర‌స్తుతం వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని మాత్రం బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. 'బిగ్ బాస్ సీజన్ 9'లో కంటెస్ట్ చేసిన ఉపేన్ పటేల్ ('ఐ'విలన్), కరిష్మా తన్నా ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ రెండేళ్లు ప్రేమాయణం నడిపినప్పటికీ ఈ మధ్యే విడిపోయారు.
 
దీంతో ఉపేన్‌ పటేల్‌ అమీతో ప్రేమలో పడ్డట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐ సినిమా సందర్భంగా మొదలైన వీరి పరిచయం స్నేహంగా, ఇప్పుడు ప్రేమగా మారిందని దీంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మీడియా కోడై కూస్తున్నాయి. ముంబైలోని ఓ హోటల్లో డిన్నర్‌ ముగించుకొని ఉపేన్ పటేల్, అమీజాక్సన్ బయటకి వస్తుండగా కెమెరాలు క్లిక్‌మనడంతో వీరి ప్రేమయాయణం బట్టబయలైందని వార్తలు వెలువడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మజ్ను' బిగ్గెస్ట్ హిట్... చైతుతో చరిత్ర పునరావృతం కావాలి : దాసరి నారాయణ రావు