Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తకు షాకిచ్చిన అమలాపాల్.. హీరో విజయ్ సరసన.. విజయ్ దర్శకత్వంలో...

మలయాళ బ్యూటీ అమలాపాల్. మాలీవుడ్ నుంచి దిగుమతి అయిన బ్యూటీ. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం కాపురం చేశాక.. మనస్పర్థలు తలెత్తడంతో వారిద్దరు ఇపుడు విడిపోయేందుకు కోర్టు మె

భర్తకు షాకిచ్చిన అమలాపాల్.. హీరో విజయ్ సరసన.. విజయ్ దర్శకత్వంలో...
, గురువారం, 25 ఆగస్టు 2016 (13:42 IST)
మలయాళ బ్యూటీ అమలాపాల్. మాలీవుడ్ నుంచి దిగుమతి అయిన బ్యూటీ. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం కాపురం చేశాక.. మనస్పర్థలు తలెత్తడంతో వారిద్దరు ఇపుడు విడిపోయేందుకు కోర్టు మెట్లెక్కారు. దీనికి కారణం.. పెళ్లి తర్వాత కూడా భార్య (అమలా పాల్) సినిమాల్లో నటిస్తానని మొండికేయడమే. ఇది కోలీవుడ్ హాట్ న్యూస్‌లలో ఒకటి. 
 
అయితే, అమలాపాల్‌కు అవకాశాలు ఇవ్వొద్దంటూ దర్శకుడు విజయ్ తండ్రి (ప్రముఖ నిర్మాత) పలువురు నిర్మాతలు, దర్శకులను కోరడంతో... అమలాపాల్‌కు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదని వార్తలు ఓవైపు గుప్పుమంటున్నాయి. కానీ, ఈ వార్తలు వస్తున్నప్పుడు ఒక కన్నడ సినిమాకు సైన్ చేసి షాక్ ఇచ్చిన అమలా మరోసారి భర్త విజయ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 
 
తమిళ స్టార్ హీరో విజయ్ తర్వాతి సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు అమలాపాల్‌ను అంగీకరించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించేది కూడా ఆమె భర్త విజయ్ కావడం గమనార్హం. దర్శకుడు విజయ్, హీరో విజయ్‌లు ఒక సినిమా చేయడానికి గతంలోనే ఓ అంగీకారం కుదిరివుంది. ఈ సినిమా నిర్మాతలు హీరోయిన్‌గా అమలాను తీసుకుందామనుకుని ఆమెను సంప్రదించగా, ఏమాత్రం వెనుకాముందు ఆలోచన చేయకుండా ఒప్పేసుకుందట. దీంతో సైలెంట్‌గా ఉన్న విజయ్‌కి.. సినిమా ఒప్పుకొని అమలా షాక్ ఇచ్చినట్టయింది. ఏదేమైనా అమలాపాల్ అంటే ఏంటో మరోసారి నిరూపించింది ఈ హాట్ భామ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బో.. రెజీనా ఎంత రేటో!