Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ రోజు రాత్రి నాతో ఎవరున్నారంటే.. గుట్టు విప్పనున్న శ్వేతాబసు!

ఆ రోజు రాత్రి నాతో ఎవరున్నారంటే.. గుట్టు విప్పనున్న శ్వేతాబసు!
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (18:08 IST)
వ్యభిచారం కేసులో పట్టుబడిన టాలీవుడ్ నటి శ్వేతాబసు.. ఈ వ్యవహారానికి సంబంధించిన లోగుట్టును విప్పేందుకు సిద్ధమవుతోంది. దీంతో పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.. బంజారాహిల్స్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తతో వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ప్రభుత్వ పునరావాస కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటోంది. 
 
అయితే, వ్యభిచారం కేసులో శ్వేతాబసును అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఆమెతో ఉన్న పారిశ్రామికవేత్త పేరును మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. దీంతో అనేక విమర్శలు వస్తున్నాయి. అదేసమయంలో శ్వేతబసుకు అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు. ఫలితంగా పోలీసులపై ఒత్తిడి పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో పోలీసులకు శ్వేతాబసు ఓ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. తనతో ఆ రాత్రి గడిపిన పారిశ్రామికవేత్త పేరును బహిర్గతం చేయాలని లేనిపక్షంలో ఈ దఫా కోర్టుకు హాజరైనపుడు తానే మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు మేజిస్ట్రేట్‍కు వివరిస్తానని చెపుతోంది. తనతో గడిపిన ఆ పారిశ్రామికవేత్త అనే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆమె చెపుతోంది. సో.. తనతో ఆ రాత్రి గడిపిన ఆ పారిశ్రామికవేత్త పేరు త్వరలోనే ఈ ముద్దుగుమ్మ వెల్లడించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu