Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు.. తల్లులకు కూడా లైసెన్స్ ఉండాలి.. మోడీని రిక్వెస్ట్ చేశా: సంజన

వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు శిశువులకు జన్మనిచ్చే తల్లులకు కూడా కచ్చితంగా లైసెన్సులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నటి సంజన వ్యాఖ్యానించింది. కొన్ని వస్తువులకు లైసెన్స్‌లు ఉన్న సంగతి

డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు.. తల్లులకు కూడా లైసెన్స్ ఉండాలి.. మోడీని రిక్వెస్ట్ చేశా: సంజన
, శనివారం, 31 డిశెంబరు 2016 (16:41 IST)
వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు శిశువులకు జన్మనిచ్చే తల్లులకు కూడా కచ్చితంగా లైసెన్సులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నటి సంజన వ్యాఖ్యానించింది. కొన్ని వస్తువులకు లైసెన్స్‌లు ఉన్న సంగతి తెలిసిందే. లైసెన్సులు విక్రయానికి ఉపయోగపడతాయి. అందుకే తల్లులకు కూడా లైసెన్సులు ఉండాల్సిందేనని సంజన తెలిపింది. 
 
ఇకపై పిల్లల్ని ప్రసవించే తల్లులకు లైసెన్సులు ఏర్పాటు చేయాలన్నారు. వారికి పిల్లల్ని కని పెంచే స్తోమత ఉందా అని విచారించి.. లైసెన్సు ఇవ్వాలన్నారు. అలా లైసెన్సు లేనివారు పిల్లల్ని కంటే శిక్ష విధించాలని వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు పిల్లలను కనడానికి తల్లులకు లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టు నటి సంజన పేర్కొన్నారు. 
 
చాలామంది తల్లులు తమ పిల్లలను కనివదిలేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము కన్నబిడ్డల్ని రోడ్డున వదిలేసి వెళ్ళడంతో వారు ప్రస్తుతం భిక్షాటన చేస్తున్నారని తెలిపారు. చంటిపిల్లలను చంకనేసుకుని అడుక్కునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని సంజన వ్యాఖ్యానించింది. మరికొందరైతే ఏకంగా పిల్లలను అద్దెకు తీసుకొచ్చి మరీ బిచ్చమెత్తుకుంటున్నారన్నారు. అలాంటి వారికి ఎంత డబ్బు ఇచ్చినా మార్పు రానేరాదన్నారు.
 
మండుటెండల్లో రోడ్లపై జీవశ్చవాల్లా పడిఉన్న పిల్లల్ని చూస్తుంటే చాలాబాధగా ఉందని సంజన వెల్లడించారు. వారికి తిండి, బట్టలు సరిగ్గాలేవని, ఇలా చాలామంది తల్లులు పిల్లల్ని బాలకార్మికులుగా మారుస్తున్నారని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్‌తేజ్‌ - శ్రీను వైట్ల కాంబినేషన్‌లో "మిస్టర్"