Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజశేఖరా...? ఆయనెవరు?

రాజశేఖరా...? ఆయనెవరు?
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:35 IST)
డాక్టర్‌ అయి నటుడిగా మారిన రాజశేఖర్‌ గురించి తెలిసే వుంటుంది. కానీ ప్రముఖ నిర్మాత అయిన ఆస్కార్‌ రవిచంద్రన్‌కు ఆయనెవరో తెలీదు. విషయం ఏమంటే... చిరంజీవి చేస్తున్న తమిళ 'రమణ' రీమేక్‌ ఠాగూర్ హక్కులు తనవనీ... చిరంజీవి మధ్యలో దూరి.. దాన్ని హైక్‌ చేశాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇది ఇండస్ట్రీకి బాగా గుర్తు. ఇలా పలు తమిళ చిత్రాలు హక్కులు కొనేసి తన దగ్గర వుంచుకున్నాననీ. ఒక్కొక్కటి బయటకు తీసి దాన్ని రీమేక్‌ చేస్తుంటానని చెప్పాడు.
 
అది నిజమేనని నమ్మేశారు. కానీ అసలు విషయం నిర్మాత చెప్పేదాక తెలీలేదు. ఆస్కార్‌ రవించంద్రన్‌ 'ఐ', మనోహరుడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్‌ దర్శకుడు. గతంలో ఆయన రమణ నిర్మించారు. ఆ విషయం ప్రస్తావిస్తూ.... రాజశేఖర్‌ ఇలా కామెంట్‌ చేశారని అడిగితే.... ఆశ్చర్యపోయి.. రాజశేఖర్‌ అంటే ఎవరు అని అడిగారు. 
 
జీవితా రాజశేఖర్‌ అని ఆయనకు గుర్తుచేయగా... అనువాద హక్కుల గురించి ఎవరూ అడగలేదు. అసలు ఆయనెవరో తెలీదు అని చెప్పాడు. దాంతో రాజశేఖర్‌ అబద్దాలకోరని అక్కడివారు చెవులు కొరుక్కున్నారు.

Share this Story:

Follow Webdunia telugu