Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమీర్ ఖాన్ అమెరికా వెళ్తున్నారట.. ఎందుకో?

ఆమీర్ ఖాన్ అమెరికా వెళ్తున్నారట.. ఎందుకో?
, గురువారం, 26 నవంబరు 2015 (19:23 IST)
మత అసహనంపై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్... త్వరలోనే అమెరికాకు వెళ్లనున్నారు. అయితే, ఈ పర్యటన ఆయన వ్యక్తిగత పనులపై వెళ్తున్నారా లేక మరో ఉద్దేశ్యంతో వెళ్తున్నారా అనేది తెలియాల్సి వుంది. 
 
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నటుడు అసహనంపై వ్యాఖ్యలు చేయగా, అది దేశ వ్యాప్తంగా పెను సంచలనమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. ఆమీర్ యూఎస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. ఈ నటుడు తాజాగా నటిస్తున్న చిత్రం 'దంగల్'. పంజాబ్‌లోని లూథియానాలో ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభంకానుంది. ఇక్కడ షూటింగ్ పూర్తికాగానే అమెరికాకు వెళ్లనున్నారు. 
 
అయితే, ఆమీర్ ఖాన్ యూఎస్ ట్రిప్పు ముందుగా ప్లాన్ చేసుకున్నదా? లేక ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆయన వెళుతున్నారా? అన్న విషయం తెలియాల్సి వుంది. కాగా, అమీర్ పై వస్తున్న విమర్శలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు మరింత భద్రత పెంచారు. 

Share this Story:

Follow Webdunia telugu