Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాల నిరాకరణ: పెళ్లికోసం నయన తహతహ

సినిమాల నిరాకరణ: పెళ్లికోసం నయన తహతహ
WD
ఆ మధ్య సౌత్‌స్కోప్ అవార్డు ఫంక్షన్లో భార్యాభర్తల్లా మెలగిన నయనతార - ప్రభుదేవా జంట పెళ్లికోసం తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఎంతమంది నచ్చజెప్పినా నయన్ లేనిదే లోకమే చీకటని అంటున్నాడట ప్రభుదేవా.

ఇక నయనతార అయితే... ప్రభుదేవాకోసం ఏం చేయడానికైనా రెడీ అని అంటోందట. ఇదంతా చూస్తున్నవాళ్లు ప్రేమంటే ఇదేరా...! అని చెప్పుకుంటున్నారట.

అన్నట్లు ప్రభుదేవాకు పెళ్లి పట్ల ఎంత తొందర ఉన్నదో తెలియదు కానీ, నయనతార మాత్రం చాలా చురుకుగా ఉన్నది. వచ్చిన సినిమా ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తోంది. మరో నెల తర్వాత ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు. కనుక పెళ్లికి రెడీ అన్నమాట.

కార్తీక మాసం చివర్లో కానీ, లేదంటే మాఘమాసం మొదట్లో కానీ నయనతార ప్రభుదేవాను ఎగరేసుకెళ్లడం ఖాయమంటున్నారు కోలీవుడ్ ఫిలిమ్ జనం. మరి ప్రభుదేవా మొదటి భార్య ఊరుకుంటుందా...? ఏం చేస్తుందో చూద్దాం...

Share this Story:

Follow Webdunia telugu