Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రియ వెనకాలే తోకూపుకుంటూ తిరుగుతున్న అక్షయ్

శ్రియ వెనకాలే తోకూపుకుంటూ తిరుగుతున్న అక్షయ్
, గురువారం, 29 సెప్టెంబరు 2011 (13:43 IST)
ఇటీవల హైదరాబాదులో జరిగిన తారల టి-20 మ్యాచ్‌ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో నాభీ నృత్యాలతో విరగదీసిన శ్రియ, ఆ తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందబ్బా అని ఆరా తీస్తే... ఓ హాలీవుడ్ చిత్రాన్ని ఒప్పుకుని అందులో నటిస్తూ బిజీగా ఉన్నదట శ్రియ.

ఆ హాలీవుడ్ చిత్రం పేరు మిడ్‌నైట్స్ చిల్డ్రన్. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌లో అమ్మడు బిజీగా ఉంటూనే ఓ బాలీవుడ్ చిత్రంలోనూ బుక్కైందట. ఆ చిత్రంలో అక్షయ్ ఖన్నా హీరో.

మిడ్‌నైట్స్ చిల్డ్రన్ చిత్రం ద్వారా హాలీవుడ్ అలవాట్లు అబ్బాయేమోగానీ, బాగా పొద్దుపోయినా అక్షయ్‌తో చిట్ చాట్ చేస్తూ గడిపేస్తుందట శ్రియ. మరోవైపు శ్రియను అరక్షణం కూడా విడిచి ఉండలేకోపోతున్నాడట అక్షయ్. ఆమె వెనకాలే తోకూపుకుంటూ తిరిగే కుక్కపిల్లలా తిరుగుతున్నాడట. ఏమో ఏం చెపుతాం... శ్రియ బుట్టలో అక్షయ్ పడిపోయాడేమో అంటున్నారు బాలీవుడ్ జనం..!!!

Share this Story:

Follow Webdunia telugu