Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లారెన్స్‌ దెబ్బకు తాప్సీ ఔట్‌... లక్ష్మీరాయ్ లింకే కారణమా...?!!

లారెన్స్‌ దెబ్బకు తాప్సీ ఔట్‌... లక్ష్మీరాయ్ లింకే కారణమా...?!!
, బుధవారం, 23 జనవరి 2013 (14:42 IST)
WD
రాఘవ లారెన్స్‌ ధాటికి తాప్సీ తప్పుకుంది. గత ఏడాది ఆఖరిలో ముని-3 సీక్వెల్‌గా తీస్తున్నట్లు అన్నపూర్ణ స్టూడియోలో ఆర్భాటంగా ప్రారంభించారు. బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ మంచి క్యారెక్టర్‌ పోషిస్తుందని అన్నాడు. 2వ పార్ట్‌ కాంచనలో లక్ష్మీరాయ్‌ నటించింది. సీక్వెల్‌గా ఆమెనే ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నవేస్తే... లారెన్స్‌ తెలివిగా... తాప్సీ ఈ పాత్రకు బాగా సరిపోతుందని కితాబిచ్చాడు. ఆమెకోసం ఫొటోషూట్‌ కూడా చేశాడు.

ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాప్సీ ఆ చిత్రం నుంచి తప్పుకుంది. కాంచనలో చేసిన లక్ష్మీరాయ్‌ను మళ్ళీ లారెన్స్‌ తీసుకున్నాడు. ముని, కాంచన కంటే ముని-3 చిత్రం ఇంకా ఆసక్తికరంగా, భయంగొలిపే విధంగా ఉంటుందని లారెన్స్‌ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు.

గతంలో ఈ పాత్ర గురించి తాప్సీ.. ఇది నాకు చాలెంజింగ్‌ రోల్‌. నేను చేస్తానా లేదా అనే డౌట్‌ కూడా వచ్చిందని లారెన్స్‌ చేయగలమని ఒప్పించాడని అంది. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడటంలేదు. కాగా, కాంచన తర్వాత లారెన్స్‌కు, లక్ష్మీరాయ్‌కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ సంఘటనతో అది మరింత బలపడినట్లయింది.

Share this Story:

Follow Webdunia telugu