Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"రెబల్" టీజర్ చూసిన ఫ్యాన్స్... నో హోప్స్ అంటూ పెదవి విరుపులు

, శనివారం, 18 ఆగస్టు 2012 (12:16 IST)
WD
ప్రభాస్ చిత్రం వెండితెరను తాకి సుమారు ఏడాది కావస్తున్న నేపథ్యంలో రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన "రెబల్" చిత్రంపై అభిమానుల్లో భారి అంచనాలు నెలకొన్నాయి. చిత్రం విడుదలకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుక్రవారం పండుగ వాతావరణం మొదలైంది.

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, క్యూట్ భామ దీక్షాసేథ్‌ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠతను మరింత పెంచేందుకు అభిమానుల కోలాహలాల మధ్య శుక్రవారం "రెబల్" టీజర్‌ను విడుదల చేశారు.

రెబల టీజర్‌తో అభిమానుల్లో ఒక్కసారిగా నిశ్శబ్ద ఛాయలు అలుముకున్నాయి. రెబల్‌లోని సన్నివేశాలు లారెన్స్ గత సినిమాలైన "మాస్","డాన్"లను తలపిస్తున్నట్లుండగా, ఈ చిత్రం కోసం బాడీపై ప్రత్యేక శ్రద్ధతో మరింత స్టైలిష్‌గా మారిన ప్రభాస్‌ను ఆ కోణంలో చూపించగలిగే సన్నివేశాలు ఒక్కటీ లేవని, హీరోయిన్ తమన్నా, దీక్షలు పూర్తిగా ఈ టీజర్‌లో కనిపించకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో రెబల్‌పై ఉన్న ఆశలు ఆవిరయ్యాయట. ఆగస్టు నేలాఖరుకో లేక సెప్టెంబర్‌లోనో విడుదల కానున్న రెబెల్ చిత్రం, అభిమానుల్ని ఎంతమేరకు ఆకట్టుకోగలదో వేచి చూడలి.

Share this Story:

Follow Webdunia telugu