Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిన తమన్నా!

రామ్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిన తమన్నా!
"దేవదాసు", రెడీ హీరో రామ్‌తో తెల్లపిల్ల తమన్నాకు ప్రేమట. అబ్బో అవునా అంటూ ఆశ్చర్యపోతున్నారా. అయితే పప్పులో కాలేసినట్టే. త్వరలో 'కందిరీగ'గా కనిపించేందుకు మస్కా హీరో రామ్ సిద్ధమయ్యాడు. 

ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ చిత్రాలతో వరుసగా రెండు హిట్‌ కొట్టిన కరణాకరన్ దర్శకత్వం వహించే చిత్రంలో రామ్, తమన్నాలు జంటగా నటించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. అంతేకాదు సినిమా టైటిల్ కూడా "ఎందుకంటే .. ప్రేమంట" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రామ్ ఓన్ బేనర్ స్రవంతి మూవీస్ పతాకంపై కరుణాకరన్ మార్క్ పొయెటిక్ ఫిల్మ్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం తమన్నా హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇప్పటికే 100% లవ్, బద్రినాథ్‌లతో తెలుగు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న తమన్నా, తాజాగా రామ్‌తో తెరకెక్కే ఎంటర్‌టైనింగ్ లవ్‌స్టోరీ "ఎందుకంటే... ప్రేమంట"లో రొమాన్స్ చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఈ చిత్రంలో తమన్నా స్కిన్ షో, గ్లామర్‌గా కనిపించనుందని తెలిసింది. ఇంకేముంది.. తమన్నా అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు పండేగ పండగ.

Share this Story:

Follow Webdunia telugu