Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవితేజ "బలుపు"కు ఓకే.. మెగా హీరోతో మాత్రం డేట్లు ఖాళీ లేవు: శ్రుతి

రవితేజ
, సోమవారం, 6 ఆగస్టు 2012 (14:27 IST)
WD
శ్రుతి హాసన్ మెగా ఫ్యామిలీ హీరోకు గట్టిగా ఝలక్ ఒకటి ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ఓ హిందీ సినిమా చేస్తున్న శ్రుతి హాసన్, అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఇద్దరమ్మాయిలతో.." అనే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా ఎంపికైంది.

ఐతే హిందీ సినిమాలతోపాటు కోలీవుడ్ ఆఫర్లతో యమ బిజీగా మారిన శ్రుతి హాన్ అల్లు అర్జున్‌కు హ్యాండిచ్చింది. తన కాల్షీట్లను సర్దుబాటు చేయలేకపోవడం వల్ల అల్లు అర్జున్ సినిమాలో నటించలేకపోతున్నాననీ తెగేసి చెప్పిందట. దీంతో అల్లు అర్జున్ టీమ్ ఆశ్చర్యానికి గురయిందట.

అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం కోల్పోయినందుకు బాధగా లేదా అని అడిగితే పనితో నేను చాలా బిజిగా ఉన్నాననీ, బాధ పడేందుకు తీరికలేదు ఎందుకంటే సినిమా ఆఫర్లతో సంతోషంగా ఉండటం వల్ల అంటూ డొంక తిరుగుడు సమాధానం చెపుతోందట.

మరో విషయం ఏంటంటే... సీనియర్ హీరో రవితేజ బలుపు చిత్రంలో నటించడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ విషయం తెలుసుకున్న జనం... మెగా ఫ్యామిలీతో శ్రుతి హాసన్‌కు ఏదయినా తేడా వచ్చిందేమోనని చెవులు కొరుక్కుంటున్నారట.

Share this Story:

Follow Webdunia telugu