Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్ చిరంజీవి సన్ రామ్ చరణ్ తేజ డెసిషన్ మెగా మెగా పవర్

మెగాస్టార్ చిరంజీవి సన్ రామ్ చరణ్ తేజ డెసిషన్ మెగా మెగా పవర్
, సోమవారం, 4 మార్చి 2013 (14:35 IST)
WD
మెగాస్టార్ పుత్రరత్నం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిర్ణయాలు కూడా మహా పవర్‌ఫుల్‌గా ఉంటాయని రచ్చతో నిరూపించాడు. తాజాగా మరోసారి తన షాకింగ్ డెసిషన్‌తో ఇండస్ట్రీలో చర్చకు తెరతీశాడు.

అసలు సంగతి ఏంటయా అంటే, సహజంగా ఓ రేంజ్ ఉన్న పెద్ద హీరోలు స్టార్ డైరెక్టర్లకే కాల్షీట్లు ఇస్తుంటారు కదా. కానీ రామ్ చరణ్ తేజ మాత్రం కథ నచ్చితే కొత్తవారికైనా ఛాన్సిచ్చి ప్రోత్సహిస్తాడనే పేరు వచ్చేసింది. రచ్చ సినిమా చేసే టైంలోనూ కొత్త దర్శకుడు సంపత్ నందికి ఛాన్సిచ్చాడు.

ఆ టైంలో రామ్ చరణ్ ఇంట్లో వాళ్లు ఇదేంటంటూ ప్రశ్నించారట. అదంతే... అని రచ్చ చేసి చూపించేశాడు. ఇప్పుడు అదే ఊపుతో పూరీ జగన్నాథ్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ అయిన గోపీతో చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పేశాడట. దీంతో మరోసారి రామ్ చరణ్ దూకుడును చూసి ఇండస్ట్రీ చరణ్ డెసిషన్‌పై చర్చించుకుంటున్నారట. మెగాస్టార్ తనయుడుగా మగధీరతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టిన రామ్ చరణ్ డెసిషన్లలో కూడా సెపరేట్ స్టయిలే.

Share this Story:

Follow Webdunia telugu