మళ్లీ ఓ అమ్మాయిని "ప్రేమ"గా చూస్తున్న సుమంత్..?!!
"
సత్యం" సుమంత్ ఆ మధ్య కమిలినీ ముఖర్జీతో సన్నిహితంగా ఉన్నాడన్న వార్తలు టాలీవుడ్‌లో గుసగుసలు పోయాయి. వీళ్లద్దరూ పార్టీలకు, ఫంక్షన్లకు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు కృష్ణ నగర్ ఫిలిమ్ వర్గాలు అప్పట్లో గోల చేశాయి. దీంతో బెంబేలెత్తిపోయిన సుమంత్, అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఏ లింకు లేదని తేల్చి చెప్పేశాడు. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. తాజాగా ఇటీవల విరానికా మంచు పార్టీకి వెళ్లిన సుమంత్, అదే పార్టీలో మెరుపు తీగలా ఉన్న ఓ అమ్మాయిని గుడ్లప్పగించి చూస్తుండిపోయాడట. అది గమనించిన సదరు బ్యూటీ గాళ్ మెల్లగా అక్కడ నుంచి మరోచోటకు తన మకాన్ని మార్చిందట. సుమంత్ అక్కడికి కూడా వెళ్లి ఆమెనే గుచ్చి గుచ్చి చూడటం మొదలుపెట్టాడట. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ బ్యూటీ నేరుగా పార్టీ హాలులోకి వెళ్లి ఫ్రెండ్స్‌తో మాట్లాడటం ప్రారంభించిందట. సుమంత్ మాత్రం పార్టీ హాలులోకెళ్లి డ్యాన్స్ చేస్తూ అదే స్పీడుతో తనకు నచ్చిన అమ్మాయి వద్దకు వచ్చి లాఘవంగా నడుమున చేయివేసి తనతో నాట్యం చేయించాడట. ఆ అమ్మాయి కూడా తొలుత కాస్త సిగ్గుపడినా తర్వాత సుమంత్‌తో కలిసి ఆడిందట. మరి ఈ ఆట ప్రేమాటగా మారుతుందో.. లేదంటే అక్కడితోనే ఆగిపోతుందో చూడాలి.