Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగాళ్లనైతే "ఖయ్ ఖయ్"... ఆడాళ్లకు "హాయ్..!!"

Advertiesment
బ్రహ్మానందం
WD
బ్రహ్మానందం గురించి తెలిసినవారెవరూ.. ఆయన గురించి మంచి చెప్పిన పాపాన పోరు. మగవారిని, ఆడవారిని వేరువేరుగా చూడటం బ్రహ్మానందానికి కొట్టిన పిండని ముఖం మీదే చెప్పేసి వెళుతుంటారు.

బ్రహ్మానందాన్ని మగవారు పలుకరిస్తే.. నొసలు చిట్లించో.. ముభావంగానో ఉండిపోతాడట. అదే ఆడవారు... అందులోనూ కొంచెం వయస్సులో ఉన్నవాళ్లు పలకరిస్తే.. చిరునవ్వుతో ఎంతోకాలం నుంచి పరిచయం ఉన్నట్లు చాలాసేపు వదలకుండా.. వాళ్లు ఇహ చాలు వదులు బాబోయ్ అన్నంతవరకూ మాట్లాడుతూనే ఉంటాటడట.

కొత్త, పాత తేడా లేకుండా ఆడవారితో చాలా చనువుగా ఉంటాడనీ, అదే మగవారైతే.. అంటీ అంటనట్లుగా ఉంటూ... తప్పించుక తిరుగుతాడని టాలీవుడ్ సినీజనం టాక్. ఏమిటీ వైఖరి... లింగవివక్షతా లేక.. ఇదేమైనా వీక్‌నెస్సా..?!! అని చాలామంది తీవ్రంగా ఆలోచిస్తున్నారట. అన్నట్లు బ్రహ్మానందానికి పద్మ బిరుదు వచ్చాక అది మరింత ముదిరి తల బిరుసు పెరిగిందని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu