Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోయపాటికి రామ్ చరణ్, మహేష్ బాబు ఝలక్.. 'సింహా' రెడీ

బోయపాటికి రామ్ చరణ్, మహేష్ బాబు ఝలక్.. 'సింహా' రెడీ
, మంగళవారం, 5 మార్చి 2013 (13:14 IST)
WD
'సింహా' హిట్ తర్వాత దమ్ముతో ముందుకు వచ్చి బోల్తా కొట్టిన బోయపాటి శ్రీనుకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ప్రిన్స్ మహేష్ బాబు ఝలక్ ఇచ్చారు. అసలు సంగతి ఏంటయా అంటే, 'దమ్ము' తర్వాత రూలర్ చిత్రాన్ని రామ్ చరణ్‌తో బోయపాటి తీయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

కానీ రామ్ చరణ్ ఎవడు, జంజీర్, కొత్తగా గోపీచంద్ చిత్రాలతో బిజీగా ఉండటంతో ఇప్పుడప్పుడే బోయపాటికి ఛాన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక మహేష్ బాబుతో కమిట్ అవ్వాలనుకున్నప్పటికీ ప్రిన్స్ డేట్లు కూడా ఖాళీ లేవట. దీంతో మళ్లీ బోయపాటి సింహా వద్దకే వెళ్లినట్లు సమాచారం. నట సంహం బాలకృష్ణతో మరో సింహాను తీసేందుకు బోయపాటి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu