Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలయ్య సరసన కాజల్‌ అగర్వాల్... కుర్ర హీరోలు మొండిచేయి

బాలయ్య సరసన కాజల్‌ అగర్వాల్... కుర్ర హీరోలు మొండిచేయి
, బుధవారం, 7 ఆగస్టు 2013 (19:49 IST)
WD
బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. ఈ నెల 12లోపు ఫైనల్‌ చేస్తామని చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర్‌ ఇటీవలే తెలిపారు. ఈ సినిమాలో బాలయ్యకు పోటీ నటుడు జగపతిబాబు.

అయితే జగపతిబాబుకు కూడా ఓ పెయిర్‌ ఉంటుంది. అది ఇంకా ఫైనల్‌ కాలేదు. బాలయ్య పక్కన బాలీవుడ్‌ నటి నటిస్తుండగా, మరో నటి కాజల్‌ నటిస్తోంది. ప్రస్తుతం ఫిలింసిటీలో పాటల చిత్రీకరణ జరుగుతోంది.

జయసింహ అనే టైటిల్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బాలయ్య వంటి సీనియర్ నటుడి ప్రక్కనే కాజల్ నటించడానికి కారణం కుర్ర హీరోలు కాజల్ అగర్వాల్ కు మొండిచేయి చూపించడమే అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu