హిమ శిఖరాలంత ఎత్తుకు ఎదిగి దభాల్న కిందపడిపోయింది ఆర్తీ అగర్వాల్ కెరీర్. ఇటీవల టాలీవుడ్ స్టార్ హోటల్ పార్టీలకెళ్లినప్పుడు బిగ్ ప్రొడ్యూసర్స వద్దకెళ్లి నేనెవరో మీకు తెలుసా...? అంటూ తనను తనే పరిచయం చేసుకుంటోందట ఆర్తీ. దీన్ని చూసిన ఆర్తి సన్నిహితులు "పూర్.. ఆర్తీ" అని నిట్టూర్పులు విడుస్తున్నారట.
భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం నేరుగా టాలీవుడ్ చేరిన ఈ సొట్టబుగ్గల భామ పెళ్లైన తర్వాత కూడా హీరోయిన్‌గా రాణించాలని ఆశపడింది. ఇందులో భాగంగా తొలుత టాప్ స్టార్ల వెంటపడి, చివరకి ఛాన్సులు దక్కకపోవడంతో హాస్య నటులతో జత కట్టింది.
సునీల్ "అందాల రాముడు" ఇచ్చిన హిట్‌తో ఆ తర్వాత ఇతర చిన్నచిన్న హాస్య నటులతో సైతం నటించడానికి "సై" అంది. చివరికి ఇటీవల ఓ ద్వితీయశ్రేణి హీరోతో లిప్ టు లిప్ ముద్దు సన్నివేశంలో నటించి హీటెక్కించే ప్రయత్నం చేసింది. బ్యాడ్ లక్... ప్రేక్షకులు మాత్రం దాన్ని అంత వేడిగా తీసుకోలేదు. దీంతో ఆర్తి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడేం చేయాలా...? అని ఆర్తీ ఆలోచనలో పడ్డట్లు టాలీవుడ్ సినీ టాక్.