Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను తప్పులు చేస్తే నాగార్జున దిద్దేవారు... అనుష్క

నేను తప్పులు చేస్తే నాగార్జున దిద్దేవారు... అనుష్క
, బుధవారం, 12 డిశెంబరు 2012 (13:38 IST)
WD
నాగార్జునతో 'సూపర్‌'తో కెరియర్‌ను ప్రారంభించిన అనుష్క 'ఢమరుకం'తో నాల్గవ చిత్రం చేసింది. నాగ్‌తో నటించడం గురించి మాట్లాడుతూ, మొదట్లో నేను సినిమాల్లోకి వచ్చేసరికి ఏక్టింగ్‌ గురించి అస్సలు తెలీదు. సెట్‌లోకి వెళ్ళిన ప్రతిసారీ భయమేసేది. నాగార్జున ఏదైనా తప్పులు చేస్తే కరెక్షన్స్‌ చేసేవారు.

ఇంకా చాలా సినిమాలు ఆయనతో చేయాలని మనసులోని మాటను చెప్పింది. ఢమరుకంలో నన్ను చాలా అందంగా ఛోటా కె నాయుడు చూపించారు. నాగ్‌ కూడా ఎంతో బాగున్నావని మెచ్చుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మిర్చి చిత్రంలో చేస్తుంది. ప్రభాస్‌ సరసన నటిస్తోంది.

అన్నపూర్ణస్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత గుణశేఖర్‌ దర్శకత్వంలో 'రుద్రమదేవి-3డి' చిత్రంలో నటిస్తున్నాననీ, ఇందుకోసం దాదాపు 100 రోజులు డేట్స్‌ ఇచ్చానని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu