ఇటీవల ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలైన కత్రినా కైఫ్ మానసికోల్లాసంకోసం న్యూయార్క్‌కు వెళ్లింది. అదేంటీ... కత్రినా వెళ్లాల్సింది లండన్ కదా... అనుకుంటున్నారా...? అవును.. నిజానికి సొంత ఊరు లండన్‌కే వెళ్లాల్సి ఉంది. కానీ తన సోదరి కుమారునితో ఆటలాడుకునేందుకు వెళ్లినట్లు చెప్పింది.
అయితే ఇది విన్న బాలీవుడ్ జనం మాత్రం కత్రినావన్నీ కాకమ్మ కథలేనంటున్నారు. బాయ్‌ఫ్రెండ్ సల్మాన్‌ఖాన్‌ను పూర్తిగా వదిలేసి కొత్త కుర్రాడి ప్రేమలో పీకల్లోతు కూరుకుపోయిందని వాదిస్తున్నారు. ఇంతకీ ఆ కొత్త కుర్రాడు ఎవరో...? అని ప్రశ్నిస్తే- బాలీవుడ్ యువహీరో రణబీర్ కపూర్ అని చెపుతున్నారు.
ఛ.. అటువంటిదేం అయివుండదులే అని అంటే- "ఊరుకోండి.. భలేవారే... ప్రస్తుతం రణబీర్ కపూర్ న్యూయార్క్‌లో సాజిద్ చిత్రం 'అంజానా అంజాని' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఎలాగూ హీరో అక్కడే ఉన్నాడు కనుక హీరోయిన్ అక్కడకు వెళ్లింద"ని అదో రకమైన నవ్వులు చిందిస్తున్నారు.
కత్రినాను ఇదే విషయంపై బాయ్‌ఫ్రెండ్‌తో కాలక్షేపం చేస్తున్నారటగా అని కదిలిస్తే... అవును. బాయ్ ఫ్రెండ్‌తో మహా జోరు చేస్తున్నా. అతడిని గట్టిగా వాటేసుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా. నా ప్రేమలో అతడు తడిసి ముద్దయి పోతున్నాడు" అని షాక్ ఇచ్చింది. ఆ తర్వాత తనే పకపక నవ్వుతూ... " బెదిరిపోయారా..? అదేనండీ మా సోదరి కుమారుడే నా బాయ్‌ఫ్రెండ్. వాడితోనే నా ఆటలు.. ముద్దూ మురిపాలు" అని చెప్పింది. మరి రణబీర్ కపూర్ సంగతో అని అడిగితే... ఎవరతను? అంది. ఇలా ప్రశ్నిస్తే మనం మాత్రం ఏం మాట్లాడతాం!!