నాగార్జునకు మమతా మోహన్ దాస్ అంటే చాలా ఇష్టం. "కింగ్"లో నాగ్ సోదరుని భార్యగా నటించింది. ఆమె నటించిన తీరు నాగ్‌ను ఆకట్టుకుంది. దాంతో ఆమెకు ఎలాగైనా తర్వాత చిత్రంలో ఆఫర్ ఇవ్వాలని "కేడి" చిత్రంలో ఇచ్చారు. తనకు నచ్చిన నాయిక మమతా మోహన్ దాస్ అని కూడా చెప్పారు.
ఇదే విషయాన్ని మమత ముందు ప్రస్తావిస్తే... "ఈ విషయాన్ని నాగ్ నాతోనూ చెప్పారు. ఆయన అంతటితో ఆగరు. బ్యూటీ, సెక్సీ అని పిలుస్తారు. నటన, గానంతోపాటు నీలో ఎన్నో నైపుణ్యాలున్నాయని కూడా మెచ్చుకుంటారు. ఇంకా కష్టపడితే పైకొస్తావ్ అని కూడా చెపుతుంటారు.
నిజంగా నాగ్ ఈజ్ గ్రేట్. ఆయనతో ఎన్ని చిత్రాలు చేయడానికైనా నేను రెడీ" అంటూ గలగలా నవ్వుతూ చెప్పింది మమత.