Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నయనతారకు వార్నింగ్ ఇచ్చిన హీరో తల్లి... ఇంటికి పిలిచి మరీ!

నయనతారకు వార్నింగ్ ఇచ్చిన హీరో తల్లి... ఇంటికి పిలిచి మరీ!
, గురువారం, 9 జనవరి 2014 (08:57 IST)
FILE
హాట్‌స్టార్ నయనతార ఇప్పుడు ఎక్కువుగా వార్తల్లో ఉంటోంది. ఆమెపై తరచూ రూమర్లు వస్తునేవున్నాయి. గతంలో ప్రభుదేవాతో ప్రేమాయణం, తర్వాత శింబు, తాజాగా 'రాజారాణి' సినిమాతో ఆర్య అంటూ కోలీవుడ్‌లో వదంతులు వచ్చాయి. అయితే నయనతార మాత్రం అటువంటిదేం లేదని అంటోంది. ఆర్య తనకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని చెబుతోంది.

ఇటీవల వచ్చిన 'రాజారాణి' సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన తర్వాత వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి బంధంగా ఏర్పడుతోందట. అది గమనించిన ఆర్యా తల్లి నయనతారను తాజాగా వాళ్ళింటికి పిలిపించుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు.

తన కొడుకుతో కలిసి సినిమాల్లో నటిస్తే ఫర్వాలేదనీ, అంతకు మించి సన్నిహితంగా ప్రవర్తిస్తే మాత్రం మర్యాద వుండదనీ ఆమె హెచ్చరించిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నయన్ బాగా అప్సెట్ అయిందనీ, అది తెలిసి ఆర్య ఆమెకు సారీ చెప్పాడనీ కూడా వార్తలు వస్తున్నాయి. ఏమైనా, నయనతార ప్రేమ విషయంలో మాత్రం సక్సెస్ కావడం లేదు. ఏమంటారు?

Share this Story:

Follow Webdunia telugu