తెలుగులో త్రీ (పవన్ కల్యాణ్-సిద్ధార్థ్-అల్లరి నరేష్) ఇడియట్స్
బాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న చిత్రం త్రీ ఇడియట్స్. ఇపుడీ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. పవన్ కల్యాణ్, సిద్దార్థ్, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో తెలుగు త్రీ ఇడియట్స్ తీసేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే... పవన్ కల్యాణ్, సిద్దార్థ్, అల్లరి నరేష్‌లకు జోడీలుగా నటించే హీరోయిన్ల ఎంపిక కూడా జరుగుతున్నట్లు సమాచారం. మొత్తమ్మీద బాలీవుడ్ బాక్సాఫీసులను బద్ధలుకొడుతున్న హిందీ త్రీ ఇడియట్స్ రేంజ్‌లో తెలుగు త్రీ ఇడియట్స్ తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు టాలీవుడ్ సినీ టాక్.