Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమన్నా ఛాన్సును తన్నుకెళ్లిన బిందాస్ బేబీ

Advertiesment
హాట్ బ్యూటీ
"వెళ్లవయ్యా వెళ్లూ..." అంటూ సదా తన తొలిచిత్రంలో తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది. ఇపుడేమో "సచ్చినోడా... నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేశావు కదరా.." అంటూ బిందాస్‌లో తిట్ల పురాణం ఎత్తుకున్న అందమైన పిల్ల షీనా షహాబది టాలీవుడ్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతోంది. ఈ అమ్మడిలో హావభావాలతోపాటు అందంకూడా కావవల్సినంత ఉండటంతో దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల్లో బుక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఈ తార ముఖంలో అంత ఎట్రాక్షన్ లేకపోయినా ముఖానికి కిందనున్న శరీర సౌష్టవాలతో టీనేజ్ కుర్రకారును కట్టిపడేసిందని టాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒకవిధంగా ఇలియానా గ్లామర్ కూడా ఇలాంటిదేనని ఉదాహరణలు కూడా చెప్పేస్తున్నారు.

ఇదిలావుంటే రాకరాక తమన్నాకు అల్లు అర్జున్ సరసన అవకాశం వస్తే.. దాన్ని కాస్తా ఈ పిల్ల గద్దలా తన్నుకుపోయిందని టాలీవుడ్‌లో అనుకుంటున్నారు. అంతేకాదండోయ్ ఈ అమ్మడు రేటు కూడా చాలా తక్కువట. అందరికంటే చాలా తక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తోందట. దీంతో నిర్మాతలు షీనాకు అవకాశమిద్దామంటూ సిఫార్సులు చేస్తున్నారట. టాలీవుడ్ తారలు.. మీ అవకాశాలను కూడా తన్నుకెళ్తుందేమో... బిందాస్ బేబీతో జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu