మొన్న "పెళ్లయిన కొత్తలో"... నిన్న "ప్రవరాఖ్యుడు"... నేడు "సాధ్యం". ఈ చిత్రాల్లో జగపతి బాబు సరసన నటించిన హీరోయిన్ ప్రియమణి. వీళ్లద్దరి జోడీ లక్కీ పెయిర్ అని కొందరు దర్శకనిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే వీరిద్దరి జోడీగా చిత్రాలను రూపొందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే... బాబు- ప్రియమణిల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మరింత ముదిరి పాకాన పడిందని టాలీవుడ్ ఫిలిమ్ జనం గుసగుసలు పోతున్నారు.
తనను సెట్స్‌లో జగపతి బాబు ఎంతగానో ప్రోత్సహిస్తారనీ, ఆయన మంచి స్నేహితుడని ప్రియమణి వయ్యారాలు ఒలకబోస్తూ చెపుతోంది. తమ జంటను లక్కీ పెయిర్ అంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సంబరపడిపోతోంది. ఇక నుంచి సాధ్యమైనన్న ఎక్కువ సినిమాలు జగపతిబాబుతో చేస్తానని చెపుతోందట. జగపతి బాబు ప్రోత్సాహం అంత బాగా ఉన్నదన్నమాట.
అదలావుంటే... జగపతి బాబు సరసన "సాధ్యం"లో మహా వేడెక్కించే బెడ్రూం సన్నివేశాలలో ప్రియమణి జీవించిందని ఫిలిమ్ నగర్ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తమ్మీద ద్రోణ చిత్రంలో బికినీలో కనబడి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ప్రియమణి, తాజాగా బెడ్రూం సన్నివేశాలతో మరోసారి కిక్కెంచబోతోందన్నమాట.