Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చూపిస్తే సరిపోదు.. ఆకట్టుకోవాలి: శ్రద్దా ఆర్య

చూపిస్తే సరిపోదు.. ఆకట్టుకోవాలి: శ్రద్దా ఆర్య
నేటి హీరోయిన్ అంటే గ్లామర్‌తోపాటు పెర్ఫార్మెన్స్ రెండూ రెండు కళ్లులాంటివని శ్రద్ద ఆర్య అంటోంది. తను చేసే పాత్రల్లో ఇవి రెండూ ఉండాలనీ, ఏది మిస్ అయినా పాత్ర తేలిపోతుందని చెపుతోంది. కేవలం అందాలను ఆరబోసినంత మాత్రన ప్రేక్షకులు చూస్తారని తాను అనుకోనని, కనుక దానితోపాటు అభినయం కూడా ఉండాలంటోంది. 

అయితే ఆరబోతకు తను అభ్యంతరం చెప్పననీ, అలాఅని కేవలం వాటికే ప్రాధాన్యత అంటే తాను అంగీకరించనని నిక్కచ్చిగా చెబుతోంది. గొడవ అనే చిత్రంతో తెలుగులో పరిచయమైన శ్రద్దా ఆర్య తాజాగా ఏవీఎస్ కోతిమూకలో నటిస్తోంది.

హిందీలో అమితాబ్ బచ్చన్ కుమార్తెగా నటించాననీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాననీ చెపుతోంది. మీడియా తనను పెళ్లి గురించి అడుగుతోందనీ, అయితే తనకు ప్రేమ పెళ్లిపై నమ్మకం లేదని, పెద్దలు చేసే పెళ్లిపై తనకు నమ్మకం ఎక్కవని చెప్పింది. కనుక పెద్దలు చేసే పెళ్లికి ఇంకా చాలా టైమ్ పడుతుందని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu