Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాసిప్పులొస్తే ఏడ్వను.. నవ్వుతా: నేహా శర్మ

Webdunia
" చిరుత" వెంట నటించిన నేహా శర్మ ఇటీవల "కుర్రాడు"తో స్టెప్పులేసింది. ఈ చలాకీ చిన్నది గాసిప్స్‌ను లెక్క చేయదట. పైపెచ్చు గాలి వార్తలంటే తనకు ఎంతో ఇష్టమని చెపుతోంది. కొంతమందిలా తను బాధపడననీ, సంతోషపడతానని అంటోంది. అసలు మన గురించి ఎవరైనా గాలి వార్తలు మాట్లాడుకుంటున్నట్లయితే మనకు గుర్తింపు వస్తున్నట్లు లెక్క వేసుకోవాలని చెపుతోంది. 

చిరుత విడుదలైన మొదట్లో తనకు మరో హీరోతో లింకులు పెడుతూ కొందరు పిచ్చి రాతలు రాయడాన్ని చూసినప్పుడు చాలా బాధపడ్డాననీ, అయితే ఆ తర్వాత నిదానంగా ఆలోచించి గాసిప్స్‌ వల్ల ఏం జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకున్నానంటోంది. నిజానికి గాసిప్ కబుర్ల ద్వారా ముఖ్యంగా సినీ పరిశ్రమలోని వారికి గుర్తింపు వస్తుందని కొత్త సంగతులు చెప్పుకొచ్చింది.

ఒక సినిమా చేసిన తర్వాత తనపై గాసిప్స్ రావడాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటానని చెప్పుకొస్తోంది ఈ ముద్దుగమ్మ. అన్నట్లు ఈ భామకు హైదరాబాద్ అంటే భలే క్రేజ్ అట. ఇక్కడి కరాచీ బిస్కెట్లు, హైదరాబాద్ బిర్యానీలను తన ఊరికి వెళ్లేటపుడు తప్పుకుండా ప్యాక్ చేయించుకుని వెళతానని చెపుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments