"యుగానికి ఒక్కడు" చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రీమాసేన్ నటనపై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీమా నటనకంటే బాడీ లాంగ్వేజ్ సూపర్‌గా ఉన్నదనీ, ఆకృతికి మరికాస్త పదును పెడితే మత్తెక్కిపోయే శరీర సౌష్టవం తన సొంతమవుతుందని చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు థియేటర్లో మాట్లాడుకోవడం కనిపించింది.
ఈ మాటలు ఎవరో చెప్పినవి కాదు... స్వయంగా రీమాసేన్ విన్నదట. తన చిత్రం "యుగానికి ఒక్కడు" విడుదలైన రోజున హైదరాబాదులోని ఓ సినిమా హాల్‌కి వెళ్లి( మేకప్ లేకుండా) కూచుని చూసిందట. హాల్‌లో తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నదట.
చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు తన నటన సంగతి అటుంచి ఎక్కువగా తన శరీర ఆకృతిపై మాట్లాడుకోవడం విన్నదట. దీంతో తన ఆకృతిని మరింత ఆకర్షంచేలా తయారు చేసుకోవాలని కసరత్తు చేస్తోందట. మొత్తానికి బాడీ గెటప్‌తో ప్రేక్షకులను కట్టిపడేద్దామనుకుంటుందన్నమాట రీమా.